Digital Kasipet:-
కాసిపేట మండల కేంద్రంలో ఈరోజు ఆదివారం సిపిఐ కాసిపేట మండలం సమితి ఆధ్వర్యంలో బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ గుండా మల్లేష్ గారి సంతాప సభ నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ సభలో నాయకులు మాట్లాడుతూ నిరంతరం పేద ప్రజల కోసం, కార్మికుల కోసం పోరాడిన గుండా మల్లేష్ గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఆయన బౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చూపించిన మార్గాలు, ఆదర్శాలను ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి దాగం మల్లేష్, మిట్టపల్లి వెంకటస్వామి, రాష్ట్ర సమితి సభ్యులు రామడుగు లక్ష్మణ్, చిత్రం నరసయ్య, సిపిఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకే రవి, నాయకులు పులి శంకర్, దాడి గట్టయ్య, దాగం రాయమల్లు, జాడి పోశం, బండారి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.