Digital Kasipet:-
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కాసిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహంనికి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్దం తిరుపతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను ఉపసంహరణ చేసుకోవాలనీ రాష్ట్రపతికి విజ్నప్తి చేస్తూ సంతకాలు సేకరించామన్నారు. కార్పొరేటు కంపనీల లాభాల కోసం రైతులను బలిచేసే వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాపీ చేయకుండా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారనీ, LRS పేద మధ్య తరగతి ప్రజలన్ని దోపిడి చేయడానికే తీసుకొచ్చారనీ ఎద్దేవా చేశారు. అలాగే మొక్కజొన్నకు మద్దతు దర ప్రకటించి, పంట నష్టం జరిగిన రైతులకు న్యాయం చేయాలనీ డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజ వ్యతిరేక విధానాలకు ప్రజలను చైతన్య పరిచి ప్రభుత్వాలపై పోరాటాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ, ధర్మరావుపేట యంపిటిసి పర్వతి మల్లేష్, దేవాపూర్ యంపిటిసి మెరుగు పద్మ-శంకర్, ప్రజాప్రతినిదులు, పార్టీ ముఖ్యనాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.