Digital Kasipet:-
కాసిపేట మండలంలో సోమవారం దుర్గామాత శోభాయాత్ర నిరాడంబరంగా నిర్వహించారు. చివరి రోజు దుర్గామాతకు కుంకుమార్చన పూజలు, ప్రత్యేక నైవేద్యం సమర్పించి అనంతరం నిమర్జనోత్వాలు జరిపారు. యువతీ, యువకులు నిమర్జనోత్వవాలలో భాగంగా నృత్యాలు, కోలాటాల మధ్య దుర్గామాత ఊరేగింపు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో గతంతో పోలిస్తే ఈసారి నిమర్జనోత్వంలో కొంత సందడి తగ్గిందని చెప్పవచ్చు.