Digital Kasipet:-
కాసిపేట మండలంలోని సోమగూడెం, రొట్టెపల్లి, దేవాపూర్ గ్రామాలలో ఈరోజు మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి నారాయణ రావు పర్యటించారు. దేవాపూర్ ఏజెన్సీ ప్రాంతంలో పీసా చట్టం ప్రకారం గ్రామసభల తీర్మానం లేకుండా ఎలాంటి భూ సర్వే లు ఇళ్లకు సంబంధించిన సర్వే చేయకూడదని జిల్లా పంచాయతీ అధికారికి ఆదివాసీ నాయకులు వినతి పత్రం అందజేశారు. రోజుకు కనీసం 50 కుటుంబాల వివరాలను నమోదు చేయాలనీ పంచాయతీ అధికారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతి అధికారి శ్రీ షేఖ్ సఫ్ధర్ అలీ, సర్పంచ్ శ్రీ సపాత్ శంకర్, శ్రీమతి యం.తిరుమల ఆనంద్ రావు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.