Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కాసిపేట మండల బిజెపి నాయకులు అరెస్ట్

Digital Kasipet:-
వెనుకబడిన వర్గాల వారికి 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ పిలుపు మేరకు హైదరాబాద్ కి తరలి వెళ్తున్న కాసిపేట మండల బిజెపి నాయకులను ముందస్తుగా చర్యల్లో భాగంగా తెల్లవారుజామున దేవాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మండల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కులాలకు అతీతంగా వెనుకబడిన వర్గాల వారికి 10% రిజర్వేషన్ కల్పిస్తే దానిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. అరెస్టయిన వారిలో కాసిపేట మండల బిజెపి అధ్యక్షుడు కాల్వ సతీశ్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు అటుకపురం  రమేష్, మండల ఉపాధ్యక్షులు రాజన్, మనోజ్ దాస్ ఉన్నారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App