Digital Kasipet:-
బెల్లంపల్లి 132/33 కేవి సబుస్టేషనులో ఆదివారం మరమ్మతు పనులు జరగనున్నాయని బెల్లంపల్లి విద్యుత్ శాఖ డిఇఇ రావుల శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. సబుస్టేషన్ పరిధిలోని బెల్లం పల్లి, తాండూరు, భీమిని, కన్నెపల్లి, కాసిపేట, నెన్నెల, వేమనపల్లి మరియు రెబ్బెన మండలాలలో రేపు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు ఆయన తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.