Digital Kasipet:-
కాసిపేట మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ సందర్భంగా అందజేస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిలుగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొని చీరలు పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గినప్పటికీ ఏ ఒక్క సంక్షేమ పథకం ఆగడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో కాసిపేట మండలం జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, ఎంపీపీ రొడ్డ లక్ష్మి, వైస్ ఎంపీపీ పుస్కూరి విక్రమ్ రావు, AMC చైర్మన్ కళ్యాణి-భీమాగౌడ్, pacs చైర్మన్ నీల, మండల ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఉపసర్పంచ్ లు, తెరాస పార్టీ మండల అధ్యక్షులు బొల్లు రమణ రెడ్డి, కార్యదర్శి మోటూరి వేణు, ప్రజాప్రతినిధులు, TRS నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.