Digital Kasipet:-
కాసిపేట మండలంలో తుడుందెబ్బ ఆదివాసీ విద్యార్థి సంఘం రాయి సెంటర్, మహిళా సంఘం, కుల సంఘం నాయకులు గురువారం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా సర్వేను ఏజెన్సీ ఏరియాలో నిలిపివేయాలని తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ గిరిజనేతరులకు ఏజెన్సీ ప్రాంతంలో భూ బదలాయింపులు 1/70 పిసా చట్టం ప్రకారం నిషేధమని అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వం చేస్తున్న సర్వే ను వెంటనే నిలిపివేయాలన్నారు. అలాగే లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని, ఏజెన్సీ ప్రాంతాలలో LRS ను రద్దు చేయాలనీ, ఆదివాసీలు సాగు చేసుకుంటున్న అటవీ భూములకు హక్కు పాత్రలను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేత
Digital shivaOctober 22, 2020