Digital Kasipet:-
ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనేతరులకు భూ బదలాయింపు క్రమబద్దీకరణ చేయడం చట్ట విరుద్ధం అని మంచిర్యాల జిల్లా ఆదివాసీ సంఘాల నాయకులు అంటున్నారు. గిరిజనేతరులు ఏజెన్సీ ప్రాంతంలో ఆస్తులను కొనడం, అమ్మడం 1/70 పేసా చట్టం ప్రకారం ఇది నిషేధమన్నారు. ఇలా భూ బదలాయింపులు చేయడం ఆపాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ మరియు జిల్లా గిరిజన అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంఘాల నాయకులు మరియు కాసిపేట మండల తుడుం దెబ్బ అధ్యక్షుడు కనక రాజు, తుడుం దెబ్బ ఉపాధ్యక్షుడు మడావి వెంకటేష్, ఆదివాసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు పెంద్ర హన్ముంత్, విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఆత్రం జంగు, జిల్లా ఉపాధ్యక్షుడు ఎడ్మమ బాపురావ్, సీడం గణపతి ఆదివాసి నాయకుడు కురిసిన తిరుపతి, రాయి సీడం రమేష్ తదితరులు పాల్గొన్నారు.