Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

LRS పై ఆదివాసీల ఆగ్రహం

Digital Kasipet:-
LRS వలన ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, LRS ను వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని ఆదివాసి సంఘం నాయకులు కాసిపేట తహసీల్దార్ భూమేశ్వర్ కి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన LRS వలన 1/70 చట్టం ప్రకారం గిరిజనులకు నష్టం కల్గుతుందని వాపోయారు. ప్రభుత్వం వెంటనే LRS ని రద్దు చేయాలనీ ఆదివాసీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కనక రాజు, కొమ్ములబాపు, ఆత్రం జంగు, మడావి వెంకటేష్, రాజన్న, మడావి గంగారాం, ఎడమ తిరుపతి, కురిసేంగా తిరుపతి పాల్గొన్నారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App