Digital Kasipet:-
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే ను గ్రామపంచాయితి సిబ్బంది సక్రమంగా నిర్వహించాలని, మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. కాసిపేట మండలంలోని ముత్యంపల్లి గ్రామ పంచాయితీ పరిధిలో గురువారం నిర్వహిస్తున్న సర్వే ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రజలందరూ తమ తమ యొక్క వ్యవసాయేతరా భూములు, ఇండ్లు, ఇళ్ల స్థలాలను తప్పకుండా ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలని, సర్వే చేస్తున్న సిబ్బందికి సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎంఏ అలీం, ఎంపీవో సఫ్ధర్ అలీ, పంచాయతీ కార్యదర్శి కవిత, సర్పంచ్ బాదు, ఉపసర్పంచ్ బోయిని తిరుపతి, ZPSS పాఠశాల జూనియర్ అసిస్టెంట్ భార్గవి, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.