Digital Kasipet:-
కేకే2 ఓసీ లో భూమిని కోల్పోయిన భూ నిర్వాసిత కుటుంబాలకు ఉద్యోగాలను కల్పించాలని బీసీ సెల్ కాసిపేట మండల అధ్యక్షులు అగ్గి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈరోజు కాసిపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి అధికారులు, కాంట్రాక్టర్లు స్థానికులకు కాకుండా ఇతరులకు ఉద్యోగాలను కల్పిస్తూ స్థానికులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. మొదట భూములు కోల్పోయిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ తర్వాత స్థానిక గ్రామ పంచాయతీ యువకులకు, మండల యువకులకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. మధ్యవర్తులకు అనవసరంగా డబ్బులు చెల్లించి మోసపోవద్దని సూచించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు కూడా అసెంబ్లీలో స్థానికులకు ఉదోగ్యాలు కల్పించాలి కోరారని ఈసందర్బంగా గుర్తు గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో తెరాస గ్రామ అధ్యక్షుడు దుర్గం రాంచందర్, ఉస్కామల్లు గోపాల్, షంషేర్, మద్దివేణి వేణు, ఉప సర్పంచి బోయిని తిరుపతి, రాజేశం, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
కేకే2 ఓసీ లో ఉద్యోగాలను కల్పించాలి
Digital shivaOctober 06, 2020