Digital Kasipet:-
కాసిపేట మండలంలోని లంబాడితండ ( కె ) గ్రామంలో శుక్రవారం సేవాలాల్ సేన ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా భూక్యా రామ్ చందర్ ని మంచిర్యాల జిల్లా సేవాలాల్ సేన అధికార ప్రతినిధిగా ఎన్నుకొని నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సమావేశంలో సేవాలాల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భూక్య రాము నాయక్ మాట్లాడుతూ గిరిజనులకు సంబంధించిన 400 ఎకరాల భూమిని ఓపెన్ కాస్ట్ కోసం సింగరేణి తీసుకొని ఇలాంటి జీవనాధారం కల్పించలేదని వాపోయారు. భూమిని కోల్పోయిన ప్రతి గిరిజన కుటుంబానికి ఒక ఉద్యోగాన్ని కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా సేవాలాల్ సేన అధ్యక్షులు గుగ్గులోత్ మల్లేష్ నాయక్, సేవాలాల్ సేన నాయకులు కునుసోత్ సురేష్ నాయక్, బానోత్ రవి నాయక్, బానోత్ పరశురామ్, అజ్మీరా దేవరాజ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.