Digital Kasipet:-
మండలంలోని కాసిపేట మేజర్ గ్రామపంచాయతీలో సోమవారం గ్రామ సభ
నిర్వహించారు. పాఠశాల మైదానంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయడంపై సభలో పాల్గొన్న స్థానిక ప్రజలు, యువకులు తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే స్మశాన వాటికను స్కూలు ఆవరణలో ఏర్పాటు చేయడాన్ని కూడా ముందునుంచే తప్పుబట్టారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉన్న మినరల్ వాటర్ ప్లాంట్ మరమ్మతులు చేయించి పునఃప్రారంభం చేయాలని గ్రామసభలో తీర్మానం చేశారు. దుబ్బగూడెం గ్రామస్తులు మాట్లాడుతూ తమ నీటి సమస్యను పరిష్కరించాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ఆందోళన చేశారు.