Digital Kasipet:-
కాసిపేట మండలంలోని సోమగూడెం (కే), ముత్యంపల్లి,చిన్న ధర్మారం గ్రామాలలో గురువారం ఎంపీడీవో ఎంఏ అలీం పర్యటించి స్మశాన వాటిక నిర్మాణ పనులను పరిశీలించారు. పల్లె ప్రకృతి వనాలలో గడ్డి ఉండకుండా చూడాలని సర్పంచ్ లకు మరియు పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ఈనెల 30వ తేదీలోగా స్మశాన వాటిక, డంపింగ్ యార్డ్ మరియు ఇతర అభివృద్ధి పనులను పూర్తిచేయాలని ఆదేశించారు.