Digital Kasipet:-
కాసిపేట మండలం దేవపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రాంపూర్ లో డ్రైనేజీ సమస్య ఉండడంతో గత కొంత కాలంగా వర్షపు నీరు మరియు మరుగుదొడ్ల నీరు నిల్వ ఉంటుంది. దీనివల్ల ప్రజలకు అనారోగ్య సమస్యలు కలుగుతాయని గ్రామ సర్పంచ్ మడావి తిరుమల విషయాన్ని దేవపూర్ సిమెంట్ కంపెనీ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లారు. కంపెనీ యాజమాన్యం స్పందించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలను చేపడుతున్నారు.