Digital Kasipet:-
కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామంలో
కిరాణా దుకాణాలపై ఈ రోజు ఆదివారం రామగుండం టాస్క్ ఫోర్సు పోలీసులు దాడులు జరిపి సుమారు 18,000 రూపాయల విలువ గల పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. దేవాపూర్ లో కొందరు కిరాణా దుకాణం దారులు నిషేధిత పొగాకు ఉత్పత్తులను నిల్వచేసి అమ్ముతున్నారనే నమ్మదగ్గ సమాచారం మేరకు గ్రామంలోని పలు కిరాణా దుకాణాల్లో తనిఖీ నిర్వహించామని టాస్క్ ఫోర్స్ సిఐ కిరణ్ పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో భాగంగా అల్లాడి విజయ్ కుమార్ మరియు బండారి సత్యనారాయణ ఇద్దరి కిరాణా దుకాణాల వద్ద నుండి 18 వేల విలువగల పొగాకు ఉత్పత్తులు మరియు గుట్కా స్వాధీనం చేసుకున్నామన్నారు. తదుపరి విచారణ కోసం ఇద్దరు నిందితులని మరియు సరుకును దేవాపూర్ పోలీస్ స్టేషన్ వారికి అప్పగించినట్టు అయన తెలిపారు. ఈ టాస్క్ ఫోర్స్ లో రామగుండం టాస్క్ ఫోర్స్ సీఐ కిరణ్, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ కిరణ్, సిబ్బంది వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, శ్యాంసుందర్, సదానందం గౌడ్ పాల్గొన్నారు.