Digital Kasipet:-
స్వేరో సర్కిల్ కాసిపేట మండల అధ్యక్షునిగా సండ్రల్పహాడ్ గ్రామానికి చెందిన దాడి పెంటయ్యని ఆదివారం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తీగల శ్రీనివాస్ నియమించారు. ఈ సందర్బంగా తీగల శ్రీనివాస్ మాట్లాడుతూ జ్ఞాన సమాజ నిర్మాణం స్వేరోస్ తోనే సాధ్యమని అన్నారు. మండల కేంద్రంలో మండల కమిటీని ఏర్పాటు చేయటం జరిగిందని అయన పేర్కొన్నారు. స్వేరో సర్కిల్ కాసిపేట మండల ప్రధాన కార్యదర్శి గా కోట సంజయ్, ఉపాధ్యక్షులుగా నారాయణ, కోట ఆదర్శ్, అధికార ప్రతినిధిగా హరికృష్ణ, జాయింట్ సెక్రటరీ మహేశ్వర్, నవీన్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ గా అనువర్మ , అనిల్, కార్యవర్గ సభ్యులుగా పల్లె అంజి, ప్రవీణ్, రాంకి, ప్రసాద్, స్వామి, శ్రీనివాస్, వినోద్, రామ్ చందర్ ని ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ బిజ్జురి రమేష్ జాయింట్ సెక్రటరీ అక్కేపెళ్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.