Digital Kasipet:-
మదర్ ప్రతిభ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామంలో యువ మహిళలకు, 45 రోజుల కుట్టు మిషన్-మగ్గం వర్క్స్ శిక్షణ కేంద్రంను పెద్దనపల్లి గ్రామ సర్పంచ్ వేముల కృష్ణ ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ కుట్టు మిషన్-మగ్గం వర్క్స్ శిక్షణ కేంద్రంను మహిళలు శ్రద్ధగా నేర్చుకొని భవిష్యత్తులో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. కుటుంబానికీ ఆసారగా ఉంటూ సమాజంలో మంచి స్థితిలో నిలవాలని ఆయన ఆకాంక్షించారు. యువ మహిళలు ఈ శిక్షణ కేంద్రంలో చేరి ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ జిల్లా కో ఆర్డినేటర్ జ్యోతి, మండల కో ఆర్డినేటర్ బోగే నాగమణి గ్రామ మహిళలు పాల్గొన్నారు.