Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి

Digital Kasipet:-
మందమర్రి సింగరేణి జనరల్ మేనేజర్ మరియు కేకే ఓసీ ప్రాజెక్ట్ అధికారిని గురువారం పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ కలిసి గ్రామంలోని వివిధ సమస్యలను చర్చించినట్లు  తెలిపారు. ఈ సందర్బంగా గ్రామపంచాయతీ పరిధిలో అనుమతి లేకుండా క్యాంపు కార్యాలయాలను నిర్వహిస్తున్నట్లు వారి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని యువత వివరాలతో కూడిన మెమోరాండం సమర్పించగా, వారు సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App