Digital Kasipet:-
కాసిపేట మండలంలోని ధర్మారావుపేట, లంబాడితండా (డీ) గ్రామపంచాయతీలలో శనివారం ఎంపీడీవో ఎంఏ అలీం పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. ధర్మారావుపేట గ్రామపంచాయతీ లో రైతు వేదిక మరియు పల్లె ప్రకృతి వనంను మరియు లంబాడితండా (డి) గ్రామపంచాయతీ లో పల్లె ప్రకృతి వనం పనులను పరిశీలించారు. పల్లె ప్రకృతి వనాలలో గడ్డి ఉండకుండా చూడాలని సర్పంచ్ లకు మరియు పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. సోమవారం లోగా పల్లె ప్రకృతి వనాలు పూర్తి కావాలని మరియు ఇతర అభివృద్ధి పనులను పూర్తిచేయాలని ఆదేశించారు.