Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కాసిపేట గ్రామంలో ఉచిత పిపిఆర్ టీకాలు

Digital Kasipet:-
పశు వైద్యాధికారి డా,, తిరుపతి ఆధ్వర్యంలో
మండలంలోని కాసిపేట గ్రామంలో బుధవారం గొర్రెలు మరియు మేకల కు ఉచిత పిపిఆర్, దొబ్బరోగం టీకాలను వేశారు. ఈ రోగం గొర్రెలకు, మేకలకు సోకకుండా ముందస్తు చర్యలుగా టీకాలు వేయడం జరుగుతుందని, ఈ వ్యాధి గాలి ధ్వారా ఒక జీవి నుండి ఇంకొక జీవికి సోకుతుందని ఇది పూర్తిగా వైరల్ క్రిమి అని పేర్కొన్నారు. దాదాపుగా 410 గొర్లు, 179 మేకలకు టీకాలు వేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాసిపేట సర్పంచ్ ధరావత్ దేవి, ఉప సర్పంచ్ పిట్టల సుమన్, పశు వైద్య సహాయకులు హబీబ్ అలీ, గోపాల మిత్ర శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App