Digital Kasipet:-
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రెవిన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ బెల్లంపల్లి ఎంఎల్ఏ దుర్గం చిన్నయ్య పిలుపు మేరకు ఈరోజు బెల్లంపల్లిలో రైతులు ట్రాక్టర్ లతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాసిపేట మండలం నుండీ పెద్ద సంఖ్య రైతులు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దుబ్బగూడెం గ్రామం నుండి మండలంలోని రైతులు 63 ట్రాక్టర్ల తో ర్యాలీగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, ఎంపీపీ రొడ్డ లక్ష్మి, ఎంపీటీసీ లు, సర్పంచులు, ఉప సర్పంచ్ లు, PACS చైర్మన్ నీలా రాంచందర్, PACS డైరెక్టర్లు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దుర్గం పోశం, సభ్యులు, తెరాస నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.