Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

టీకాలు వేయకపోతే రైతులకు అపార నష్టం

Digital Kasipet:-
కాసిపేట మండలంలో జరిగిన పిపిఆర్ వ్యాధి
నిరోధక టీకాల కార్యక్రమంలో జిల్లా పశువైద్యాధికారి శంకర్ పాల్గొన్నారు. సోమగూడెంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని అయన పరిశీలించి మేకలకు, గొర్రెలకు టీకాలను వేయడం వలన కలిగే లాభాలను రైతులకు వివరించారు. ఈ వ్యాధి సోకితే జీవాలు విపరీతమైన విరేచనాలు, నోట్లో పుండ్లతో బలహీన పడి మృతి చెందుతాయని రైతుకు చాలా నష్టం వాటిల్లుతుందని అన్నారు. కావున ఆ నష్టం జరగకుండా ఉండడానికి ముందస్తుగా తమ మేకలకు, గొర్రెలకు టీకాలు వేయించాలని సూచించారు. కార్యక్రమంలో కాసిపేట పశువైద్యాధికారి డా.తిరుపతి మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App