Digital Kasipet:-
ప్రైవేట్ యూనివర్సిటీ లను రద్దు చేయాలని MSU ఆధ్వర్యంలో పల్లె పల్లెకు ప్రచార యాత్రను నిర్వహించారు. ఈ యాత్రలో భాగంగా బుధవారం కాసిపేట మండలంలో ప్రచార యాత్రను చేపట్టారు. ఈ సందర్బంగా మహాజన స్టూడెంట్ యూనియన్ మంచిర్యాల జిల్లా ఇంచార్జి చెన్నూరి సమ్మయ్య మాదిగ మాట్లాడుతూ SC, ST, BC, మైనార్టీలకు రిజర్వేషన్లు, ఫీజ్ రియంబర్స్మెంట్ కల్పించని యూనివర్సిటీలు ఎందుకని ప్రశ్నించారు. దళిత, గిరిజన, బహుజన, మైనారిటీ విద్యార్థులను విద్యకు దూరం చేయడానికే ప్రైవేటు యూనివర్సిటీలను ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకువచ్చారని ఆయన మండిపడ్డారు. మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు పల్లె పల్లెకు ప్రచార యాత్రను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 2023 లో మహాజనులు అందరు ఏకమై మంద కృష్ణ మాదిగ గారిని ముఖ్యమంత్రి ని చేసి కెసిఆర్ ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గొడిశల బాలయ్య, MRPS సీనియర్ నాయకులు, మెరుగు అమూర్తి గోడిశల సురేందర్, MYS నాయకులు, దాసరి వినయ్ MSF జిల్లా నాయకులు, గోడిశల కళ్యాణ్, చొప్పదండి కిషన్, మాల్యాల శంకర్ తదితరులు పాల్గొన్నారు.