Digital Kasipet:-
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన LRS వలన ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆదివాసీ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కాసిపేట మండలంలోని కొండాపూర్ గ్రామంలో వివిధ ఆదివాసీ సంఘాల నాయకులు మంగళవారం సమావేశమై LRS పై చర్చించారు. ఈ చట్టం వలన ఆదివాసీలకు నష్టం కలుగుతుందని, ప్రభుత్వం వెంటనే దీనిని ఉపసంహరించుకోవాలని తుడుందెబ్బ, ఆదివాసీ విద్యార్ధి సంఘం, రాయిసెంటర్ ఆదివాసీ గ్రామ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో AHPS రాష్ట్ర కార్యదర్శి ఆడ జంగు, AHPS మంచిర్యాల జిల్లా ప్రచార కార్యదర్శి వెడ్మ బాపురావు, AHPS జిల్లా ఉపాధ్యక్షులు నవనందుల రాజేశ్వర్, ASU మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెడ్మ కిషన్, AHPS కాసిపేట మండల అధ్యక్షులు కనక రాజు, ASU కాసిపేట మండల అధ్యక్షులు పేంద్రం హన్మంత్, AHPS మండల ఉపాధ్యక్షులు మడావి వెంకటేష్, రాయిసెంటర్ మెస్రం మహాదు, నాయకులు సిడం జంగు, మడావి గంగారాం, కురిసేంగా తిరుపతి, మడావి రాము పాల్గొన్నారు.