Digital Kasipet:-
విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో
ముఖ్యం. ఈ విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించి విద్యాలయాలకు క్రీడా మైదానాలు ఏర్పాటు చేశారు. అలాంటి మైదానాలలో ప్రకృతి వనాలను ఏర్పాటు చేయడం ఏంటని కాసిపేట గ్రామంలోని యువకులు, పాఠశాల ఉపాధ్యాయులు వాపోతున్నారు.
విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో
ముఖ్యం. ఈ విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించి విద్యాలయాలకు క్రీడా మైదానాలు ఏర్పాటు చేశారు. అలాంటి మైదానాలలో ప్రకృతి వనాలను ఏర్పాటు చేయడం ఏంటని కాసిపేట గ్రామంలోని యువకులు, పాఠశాల ఉపాధ్యాయులు వాపోతున్నారు.
![]() |
ZPHS పాఠశాల మైదానంలో ఏర్పాటుచేసిన పల్లె ప్రకృతి వనం |
కాసిపేట గ్రామంలో జెడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల మైదానంలో అధికారులు పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. తమకు సమాచారం ఇవ్వకుండా మైదానంలో పకృతి వనాన్ని ఏర్పాటు చేసినట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు తెలిపారు. స్థానిక యువకులు గ్రామపంచాయతీ వాటర్ ట్యాంకర్ ని అడ్డుకొని, పనులను నిలిపివేయాలని కోరారు. దింతో కాసిపేట పోలీసులు, ఎంపీడీఓ, ఎంఆర్వో సంఘటన స్థలానికి చేరుకొని యువకులతో మరియు పాఠశాల ఉపాధ్యాయులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కాసిపేటలో ఒకటే క్రీడామైదానం ఉందని, దానిని కూడా వనాలు పేరుతో మొక్కలు నాటుటూ ఆట స్థలం లేకుండా చేస్తున్నారని, ప్రకృతి వనం కోసం వేరే ప్రదేశాన్ని ఏర్పాటు చేయాలనీ యువకులు వాగ్వాదానికి దిగారు. కాసిపేట ఎమ్మార్వో భూమేశ్వర్ మాట్లాడుతూ కాసిపేట గ్రామంలో ప్రభుత్వ భూమి లేదని అందుకే పల్లె ప్రకృతి వనం కోసం ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. అధికారులు మరియు యువకుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం కొనసాగింది. ఎంపీడీఓ ఎంఏ అలీం మాట్లాడుతూ మైదానంలో ఆటలకు ఇబ్బంది కలగకుండా వనాన్ని వెనకకు జరుపుతామని అనడంతో యువకులు అయిష్టంగా ఒప్పుకున్నారు. ఎంపీడీఓ అలీ, ఎమ్మార్వో భూమేశ్వర్, సర్పంచ్ దరావత్ దేవి, ఉపసర్పంచ్ పిట్టల సుమన్, ZPHS ఉపాద్యాయులు, బెల్లంపల్లి అసెంబ్లీ YCGS రత్నం ప్రదీప్, ఉమాకాంత్, ప్రసాద్, యువకులు, పోలీసులు తదితరులు ఉన్నారు.