Digital Kasipet:-
కాసిపేట మండలం రొట్టపల్లి గ్రామానికి చెందిన
గర్భిణీ మహిళ నొప్పులు రావడంతో కాసిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చింది. ఆస్పత్రి సిబ్బంది మహిళను మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలని సూచించడంతో పిహెచ్సీ నుండి బయటికి రాగా నొప్పులు ఎక్కువ కావడంతో ఆస్పత్రి ఆవరణలోనే ప్రసవించింది. పేద మహిళ కావడంతో మంచిర్యాలకు వెళ్ళడానికి సరిపడే డబ్బులు లేవని ఆవేదన వ్యక్తం చేయగా మండలంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు మహిళకు రూ.4,500 ఆర్థిక సహాయం చేశారు. అంబులెన్స్ సిబ్బంది సెలవులో ఉండడంతో స్థానిక ఉపసర్పంచ్ బోయిని తిరుపతి హాస్పిటల్ కి వెళ్ళడానికి ఆటో ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పెద్దనపల్లి ఎంపీటీసీ కొండాబత్తుల రాంచందర్, ముత్యంపల్లి ఉపసర్పంచ్ బోయిని తిరుపతి, కాసిపేట ఉపసర్పంచ్ పిట్టల సుమన్, తెరాస ముత్యంపల్లి యాత్ ప్రెసిడెంట్ మర్రిపెల్లి ప్రశాంత్ ఆర్థిక సహాయాన్ని అందజేశారు.