Digital Kasipet:-
కాసిపేట చుట్టుపక్క గ్రామల ప్రజలు ఏటీఎం సేవలు వినియోగించుకోవడానికి ముత్యంపల్లి గ్రామంలోని నెంబర్ 1 ఎటిఎం ని ఉపయోగిస్తారు. దాదాపు పది, పదిహేను గ్రామాల ప్రజలు డబ్బుల కోసం ఈ ఏటీఎం పైనే ఆధార పడతారు. మండల కేంద్రానికి సమీపంలో ఉన్న No1 ATM నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. ఏటీఎం లోపల దుర్గంధం రావడంతో ప్రజలు ఇబ్బందిగా ఏటీఎం సేవలు వినియోగించుకునే పరిస్థితి. అంతేకాకుండా ఏటీఎంలో తరచుగా సాంకేతిక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. వినియోగదారుల నుండి అధిక చార్జీలు వసూలు చేస్తూ నిర్వహణ మాత్రం పట్టించుకోవడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.