Digital Kasipet:-
తెలంగాణ ప్రభుత్వం LRS పేరుతో పేద ప్రజల నుండి ధనాన్ని దోచుకుంటుందని కాసిపేట మండల బీజేపీ అధ్యక్షులు సతీష్ రెడ్డి ద్వజమెత్తారు. LRS ను రద్దు చేయాలనీ భారతీయ జనత పార్టీ ఆధ్వర్యంలో కాసిపేట తహసీల్దార్ భూమేశ్వర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రజల నుండి డబ్బు దోచుకోవడానికే LRS ని ప్రవేశ పెట్టారని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ ప్రజా వ్యతిరేక చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చ అధ్యక్షుడు అటకపురం రమేష్, మండల ప్రధానకార్యదర్శి కనుకుంట రాజశేఖర్, ఉపాధ్యక్షుడు మనోజ్ దాస్, రాజన్, పొలవెని పోషం, మండల కార్యదర్శి బానొత్ రవి నాయక్, బ్రిజేష్ OBC మోర్చ మండల అధ్యక్షుడు పెద్దపెళ్ళి శంకర్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు లింగాల నరేష్, కార్తిక్ మండల సలహా దారుడు మడసు శంకర్ పాల్గొన్నారు.