Digital Kasipet:-
కాసిపేట మండలంలోని అన్ని రేషన్ దుకాణాలు
ఈరోజు శనివారం స్వచ్ఛందంగా మూసివేశారు. బెల్లంపల్లికి చెందిన రేషన్ డీలర్ దినేష్ యాదవ్ నిన్న సాయంత్రం మృతి చెందడంతో సంతాపంగా ఈరోజు రేషన్ దుకాణాలను మూసివేశారు. దినేష్ యాదవ్ కి కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్ రావడంతో హోమ్ క్వారంటైన్ లో ఉన్నాడు. మూడు రోజుల క్రితం షుగర్ లెవెల్స్ పెరగడం తో కుటుంబసభ్యులు హైదరాబాద్ లోని హాస్పిటల్ కి తరలించారు. తరువాత ఆరోగ్యం విషమించడంతో నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో అతను మరణించినట్లు రేషన్ డీలర్ యూనియన్ వారు తెలిపారు. అతని మరణానికి సంతాపంగా ఈరోజు బెల్లంపల్లి మరియు కాసిపేట మండలాలలో అన్ని రేషన్ దుకాణాలను స్వచ్చందంగా మూసివేశారు.