Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

గురువాపూర్ లో మాత్రల పంపిణి

Digital Kasipet:-
ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకూడదనే
ఉద్దేశ్యంతో కాసిపేట మండలానికి చెందిన రామగుండం మహేష్ శ్రీ సాయి వైకుంఠ ట్రస్ట్ చైర్మన్ డా,, రవి కిరణ్ యాదవ్ తో మాట్లాడి హోమియో మాత్రలను ముత్యంపల్లి గ్రామ పంచాయతికి పంపిణి చేశారు. ఈ మాత్రలను సర్పంచ్ ఆడే బాదు, ఉపసర్పంచ్ బోయిని తిరుపతి యాదవ్ లు పంచాయతీ పరిధిలోని గురువాపూర్ లో గల గిరిజన ప్రజలకు అందజేశారు. సర్పంచ్ మాట్లాడుతూ ఈ మాత్రలను ఒక నెలలో వరుసగా మూడు రోజులు ఐదు చొప్పున పరగడుపున వేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముత్యంపల్లి సర్పంచ్ ఆడే బాదు, ఉపసర్పంచ్ బోయిని తిరుపతి యాదవ్, వార్డ్ మెంబెర్ సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App