Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మాజీ ప్రధాని ఆత్మ శాంతించాలని మౌనం పాటింపు

Digital Kasipet:-
కాసిపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో
కార్యాలయంలో ఈరోజు మంగళవారం జెనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆత్మ శాంతి చేకూరాలని సభ్యులు 2 నిముషాలు మౌనం పాటించారు. అనంతరం సభ్యులు మాట్లాడుతూ కాసిపేట్ పీహెచ్సీ లో కరోనా పరీక్షలు ఒక్కరే నిర్వహించడం వలన ఆలస్యం అవుతుందని ప్రస్తావించగా ఎంపీడీఓ స్పందించి ఉన్నతాధికారులతో  ఈ విషయం గూర్చి మాట్లాడుతానని అన్నారు.  ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎం.ఏ అలీ, ఎంపీపీ రొడ్డ లక్ష్మి, గ్రామ సర్పంచ్ లు, కో - ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App