Digital Kasipet:-
కాసిపేట మండలంలోని ధర్మారావు పేటలో బుధవారం ADA సురేఖ పర్యటించారు. మంచిర్యాల జిల్లాలోనే మొట్టమొదట పూర్తి అయినా రైతు వేదిక ధర్మారావుపేట రైతు వేదిక అని ఆమె పేర్కొన్నారు. రైతు వేదిక వలన రైతుల సమావేశం ఏర్పరిచి వారి సమస్యను త్వరగా పరిష్కరించడానికి సులువుగా ఉంటుందని తెలిపారు. అనంతరం వరిపేట, గుండ్లపహాడ్ లలో గల పత్తి పంటను మరియు సండ్రల్పాహాడ్ లోని పసుపు పంటను సందర్శించారు. వాటికీ రోగాలు రాకుండా తగు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో AO వందన, AEO శ్రీధర్ ఉన్నారు.