Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

పలు దుకాణాలకు జరిమానా విధింపు

Digital Kasipet:-
కాసిపేట మండలంలో ఈరోజు మంచిర్యాల జిల్లా
డీ.పీ.వో నారాయణ రావు మరియు బెల్లంపల్లి డి.ఎల్.పి.వో ఫనిందర్ ఆకస్మికంగా పర్యటించారు. కాసిపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులతో సమావేశం నిర్వహించారు. గ్రామాలలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. దుకాణాలలో తనిఖీ చేసి పరిశుభ్రత పాటించని వారికి జరిమానా విధించారు. సరిగ్గా పనిచేయని MPW వాళ్ళని విధులలో నుండి తొలగించాలని ఆదేశించారు. కాసిపేట గ్రామపంచాయతీ పరిధిలోని 6 దుకాణాలకు మొత్తం 5వేల రూపాయలు, ముత్యంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఒక దుకాణానికి 500 జరిమానా విధించారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App