Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కార్మికులకు, వికలాంగులకు పండ్ల పంపిణీ

Digital Kasipet:-
భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి 70వ
పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామంలో ఓరియంట్ సిమెంట్ కంపెనీ ప్రాంగణం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో 60 మంది కార్మికులకు మరియు 10 మంది వికలాంగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కాసిపేట మండల అధ్యక్షులు సతీష్ రెడ్డి మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలలో ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన సంస్కరణలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు అటుకపురం రమేష్, మండల ప్రధాన కార్యదర్శులు కనుకుంట్ల రాజశేఖర్, దేవునూరి సంతోష్, ఉపాధ్యక్షులు మనోజ్ దాస్, రాజన్, బీజేవైఎం మండల అధ్యక్షుడు మాదాసు సురేష్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App