Digital Kasipet:-
కాసిపేట మండలం నుండి లంబాడితండా(ఎస్) పాఠశాల ఉపాద్యాయుడు వడ్డి శంకర రావు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయిన విషయం తెలిసిందే. ఆయనను ఈరోజు శుక్రవారం కాసిపేట మండల విద్యా శాఖ ఆధ్వర్యంలో పూలమాల వేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం జిల్లా విద్యా శాఖ నుంచి అందించిన ఉత్తమ ఉపాధ్యాయ పత్రాన్ని జిల్లా పరీక్షల విభాగం అసిస్టెంట్ కమీషనర్, ఎంఈఓ దామోదర్ రావు పత్రాన్ని అందించారు. వారు మాట్లాడుతూ శంకర రావు సేవలను గుర్తించి ఉత్తమ జిల్లా ఉపాధ్యాయులుగా ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులు శంకర రావు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి నుంచి ఇప్పటి వరకు తన అనుభవాలను పంచుకున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కుడుదుల శ్రీనివాస్, తణుకు నాగేశ్వర్ రావు, ఉమా రాణి, ఎడ్ల రమేష్, కవిత, ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులు జె సురేష్, వర లక్ష్మీ పాల్గొన్నారు.