Kasipet Mandal App:-
తల్లిదండ్రులు మందలించారని వ్యక్తి పురుగుల
మందు తాగిన ఘటన మామిడి గూడలో చుటుచేసుకుంది. విషయంలోకి వెళ్తే కాసిపేట మండలం మామిడిగూడ గ్రామానికి చెందిన లావుడ్య పులియ వృత్తిరీత్యా కూలి. ఇతని కుమారుడు రూ.500 ఇవ్వమని తల్లిదండ్రులను అడిగాడు. కానీ వారు ఇవ్వకపోవడంతో మనస్తాపం చెంది పురుగుల మందు తీసుకున్నాడు. కుటుంబసభ్యులు సమీపంలో ఉన్న మందమర్రి హాస్పిటల్ కి తీసుకువెళదామని అనుకున్నప్పటికీ మధ్యలో వాగు ప్రవాహం ఎక్కువ ఉండటం వలన, రైల్వే ట్రాక్ నుంచి కూడా పోలేని పరిస్థితి ఉండటంతో ఇబ్బందులు పడ్డారు. బైక్ మీద మామిడి గూడ నుంచి కాసిపేట వరకు వచ్చి 108 కి కాల్ చేసి హాస్పిటల్ కి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. మామిడిగూడెం నుండి మందమర్రికి వెళ్ళడానికి సరైన మార్గం లేక గతంలో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఇకనైన అధికారులు మరియు ప్రజాప్రతినిధులు తమ సమస్యను పరిష్కరించాలని మామిడి గూడ ప్రజలు కోరుతున్నారు.