Kasipet Mandal App:-
కాసిపేట మండలంలోని రైతులు పిఏసిఎస్ లోని
Fertilizer bags కొనుగోలు చేసే ముందు పట్టా పాస్ బుక్ జిరాక్స్ మరియు ఆధార్ కార్డు తప్పనిసరిగా వ్యవసాయ సంఘం కార్యాలయానికి తీసుకురావాలని మండల వ్యవసాయాధికారి వందన గారు తెలిపారు. ప్రతి రైతు తనకు ఎన్ని బ్యాగులు అవసరమో అన్ని మాత్రమే తీసుకోవాలన్నారు. క్రయవిక్రయాలు అన్ని ఈపాస్ యంత్రాల ద్వారా జరగాలని, దానికి రైతుల సహకారం చాలా అవసరమన్నారు. అలాగే రైతులు పంట పొలాలు, చేనుల వద్ద డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసుకొని మురుగు నీరును బయటికి పోయేలా చేయాలని, మొక్క బలహీనంగా ఉన్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించారు.