Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

పనులు చేయడం లేదని ప్రజల ఆగ్రహం

Kasipet Mandal App:-
మండలంలోని కాసిపేట గ్రామ పంచాయితీలో
ఈరోజు గ్రామ సభ నిర్వహించారు. ప్రజాసమస్యలు పట్టించుకోట్లేదని ప్రజలు గ్రామ సభలో ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు సరిగా లేవని, వీధి దీపాలు అమర్చట్లేదంటూ, పారిశుధ్య కార్యక్రమాలు చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయితీ కార్యదర్శి మౌనిక మాట్లాడుతూ 15 రోజులలో గ్రామ పంచాయతీలో ఉన్న సమస్యలను గుర్తించి, ఈ నెల 30న గ్రామసభ ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ధరావత్ దేవి, ఉపసర్పంచ్ పిట్టల సుమన్, ఎంపీటీసీ లక్ష్మి, పంచాయితీ సెక్రటరి మౌనిక మరియు ప్రజలు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App