Kasipet Mandal App:-
కాసిపేట మండలంలోని దుబ్బగూడెం గ్రామంలో
నీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్థులు రోడ్డుపై బైటాయించి ఆందోళన చేశారు. నాలుగు రోజులుగా గ్రామంలో నీటిసరఫరా చేయండం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి పోలీసులు, సర్పంచ్ చేరుకొని గ్రామస్థులకు నచ్చచెప్పారు. పంపు ఆపరేటర్ మల్టీపర్పస్ వర్కర్ విధులు నిర్వహించడానికి ఇష్టపడకపోవడంతోనే సమస్య తలెత్తినదని, పంపు ఆపరేటర్ తో మాట్లాడి నీటి సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.