Kasipet Mandal App:-
కాసిపేట మండలం దేవాపూర్, పల్లంగూడెం
గ్రామాలలో ఈరోజు గురువారం గౌడ కులస్తులు సమావేశమై మోకు దెబ్బ గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. దేవాపూర్ కమిటీ అధ్యక్షుడిగా ఈ రాజయ్య గౌడ్, ఉపాధ్యక్షులుగా బి. శంకర్ గౌడ్ బి సత్తయ్య గౌడ్ , ప్రధాన కార్యదర్శిగా వెంకటేష్ గౌడ్, సహాయ కార్య దర్శులుగా,టీ. సాగర్ గౌడ్, బి భాస్కర్ గౌడ్, ప్రచార కార్య దర్శులుగా బి ప్రవీణ్ గౌడ్, సురేష్ గౌడ్, కోశాధికారిగా సుదర్శన్ గౌడ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే పల్లంగూడెం గ్రామ కమిటీ అధ్యక్షులుగా జె. శేఖర్ గౌడ్, ఉపాధ్యక్షులుగా ముక్కెర మహేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా తాళ్ల వెంకటేష్ గౌడ్, కోశాధికారిగా కొండ రాజ్ కుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.