Kasipet Mandal App:-
కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామానికి
చెందిన ప్రణయ్ కుమార్ అనే యువకుడు వివిధ రూపాలలో మట్టితో వినాయక విగ్రహాలను తయారు చేస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటున్నాడు. ప్రణయ్ కుమార్ కాసిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. చిన్నతనం నుండే అందరు ఆకట్టుకునేలా పెన్సిల్ తో చిత్రపటాలను గీస్తూ, మట్టితో విగ్రహాలను తయారు చేస్తూ అబ్బురపరుస్తున్నాడు. గత సంవత్సరం మట్టి విగ్రహం తయారు చేసినందుకు ఓరియంట్ సిమెంట్ కంపెనీ అధ్యక్షులు SK పండే గారి చేతులమీదుగా బహుమతిని కూడా అందుకున్నాడు. అయితే అందరు పర్యావరణానికి హాని కలిగించని మట్టి విగ్రహాలు పూజించాలనే ఉద్దేశ్యంతో తక్కువ ధరకు మట్టి విగ్రహాలను తయారు చేసి అందజేస్తున్నాడు. మట్టి విగ్రహాలకోసం 8186872002 నెంబర్ కి కాల్ చేసి సంప్రదించండి.