కాసిపేట మండలంలోని ముత్యంపల్లి గ్రామంలో
కరోనా కలకలం రేపుతోంది. పట్టణాలలో విజృంబిస్తుస్తున్న కరోనా ఇప్పుడు పల్లెలకు పాకుతుంది. ఈరోజు కాసిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తొమ్మిది మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. స్థానిక సర్పంచ్, ఉపసర్పంచ్ ప్రజాప్రతినిధులు బారికేట్లను ఏర్పాటు చేసి కంటైనెమెంట్ జోన్ గా ప్రకటించారు. మండలంలో ఈరోజే తొలిసారిగా కరోనా పరీక్షలు నిర్వహించగా ఇకనుండి ప్రతి మంగళవారం మరియు శనివారం వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు.