Kasipet Mandal App:-
బెల్లంపల్లి MLA దుర్గం చిన్నయ్య గారి
ఆధ్వర్యంలో ఈరోజు కాసిపేట మండలంలోని కొండాపూర్ మరియు కాసిపేట గ్రామాల TRS గ్రామ కమిటీలను ఎన్నుకోవడం జరిగిందని కాసిపేట మండల తెరాస అధ్యక్షులు రమణ రెడ్డి గారు తెలిపారు. కాసిపేట TRS గ్రామ కమిటీ అధ్యక్షునిగా దుర్గం రాంచందర్, ప్రధాన కార్యదర్శిగా కొమ్మ భూమయ్య, ఉపాధ్యక్షులు గా రత్నం రాజన్న, బిజ్జురి శ్రీనివాస్, కార్యదర్శి గా నక్పురి శ్రీనివాస్ ను నియమించారు. అలాగే కొండాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు గా ఒల్లేపు రాజు, ప్రధాన కార్యదర్శిగా రంగు రమేశ్, ఉపాధ్యక్షులు గా వెంబడి కిషన్, నలగొండ శ్రీనివాస్, కార్యదర్శి లుగా కుడ్మేత శేఖర్,చంద్రమౌళి ను నియమించారు.