Kasipet Mandal App:-
తెలంగాణలో మూడున్నర శతాబ్దాల క్రితం
బహుజన రాజ్యాన్ని స్థాపించి 30 ఏళ్ళు నిరాటంకంగా పరిపాలించిన బహుజన పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 350 జన్మదిన వేడుకలను విజయవంతం చేయాలనీ సామజిక ఛైతన్య వేదిక అధ్యక్షులు పల్లె మల్లయ్య గారు పిలుపునిచ్చారు. ఈ నెల 18న మంగళవారం కాసిపేట మండలం కొండాపూర్ యాప చౌరస్తాలో కాసిపేట మండలం మోకు దెబ్బ మరియు సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. మండలంలోని గౌడ సోదరులు, ఎస్సీ, ఎస్టీ, బిసి ప్రజా సంఘాల నాయకులు మరియు సామాజిక చైతన్య వేదిక నాయకులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.