Digital Kasipet:-
1970 వరకు అమలులో ఉన్న SNT రిజర్వేషన్
పునరుద్ధరించాలని గొల్ల కుర్మ నవనిర్మాణ సమితి రాష్ట్ర అధ్యక్షులు దాసరి నగేష్ యాదవ్ గారు డిమాండ్ చేశారు. కాసిపేట మండలంలోని ముత్యంపల్లి గ్రామంలో ఈరోజు జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అథిదిగా పాల్గొన్నారు. ఈసందర్బంగా అయన మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినా గొల్ల కుర్మలు గోర్లు కాసుకుంటూ సమాజానికి దూరంగా ఉంటున్నారని, విద్యకు దూరమై సాంఘిక వెనుకబాటుకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధంగా గొల్లకుర్మలకు దక్కాల్సిన వాటా దక్కలేదని అన్నారు. 1970 వరకు అమలులో ఉన్న SNT రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీనికోసం జిల్లాలోని గొల్ల కుర్మలు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ అధ్యక్షులు సిద్ది రమేష్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి తాటికొండ వెంకటేష్ యాదవ్, జనగామ జిల్లా యూత్ అధ్యక్షులు చెరుకూరి శేఖర్ యాదవ్, కాసిపేట్ మండలం ఉపసర్పంచ్‌ల ఫోరమ్ అధ్యక్షులు బోయిని తిరుపతి యాదవ్, సాయి కిరణ్ యాదవ్, అజయ్ యాదవ్, లక్ష్మణ్ యాదవ్, తిరుపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.