Kasipet Mandal All:-
కాసిపేట మండలంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ
ఆధ్వర్యంలో స్వర్గీయ భారత దేశ మాజి ప్రధాని రాజీవ్ గాంధీ 76 వ జయంతి సందర్బంగా మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిద్దం తిరుపతి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ మన దేశానికి దేశ ప్రధానిగా పేద ప్రజలకు ఎన్నో రకాల సేవలు చేసారని కొనియాడారు. దేశంలో ప్రతిష్టాత్మక పనులు చేసే సమయంలో ఉగ్రవాదుల చేతిలో హత్య కాబడడం దేశానికి తీరని లోటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ, నాయకులు మాజి సర్పంచ్ కామేర శ్రీనివాస్, కూకట్ల దేవెందర్, గాదం గట్టయ్య, మైదం రమేష్, కొత్త రమేష్, మల్లెత్తుల రాజేశం , పాల్గొన్నారు.