Kasipet Mandal App:-
అడవి ప్రాంతంలో ఉండాల్సిన వన్య ప్రాణులు
జనావాసంలోకి వస్తున్నాయి. కాసిపేట మండలంలోని కోమటిచెను గ్రామసమీపంలో ప్రధాన రహదారిపై కొండచిలువ చనిపోయి కనిపించింది. అడవి ప్రాంతం నుండి పక్కన ఉన్న పంటపొలాల ద్వారా రోడ్డు పైకి వచ్చి వాహనం తొక్కడం వల్ల కొండచిలువ చనిపోయినట్లు తెలుస్తుంది. వ్యవసాయ కూలీలు పంటపొలాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వర్షాకాలం కావడంతో పాములు, కొండచిలువలు, ఇతర విష ప్రాణులు ఇండ్లలోకి వస్తున్నాయి. గత నెలలో కాసిపేట మండల కేంద్రంలో ఒకరి ఇంట్లోకి కొండచిలువ చేరి కోడిని మింగిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు తరచు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి, అటవీ శాఖ వారికి సమాచారం ఇవ్వడం మంచిది.