Kasipet Mandal App:-
కాసిపేట మండలంలో ఈరోజు తెలంగాణ
జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలలో జయశంకర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సోమగూడెంలో హరితహారం మొక్కలను నాటారు. సర్పంచ్ శంకర్ మరియు ఆలయ ఫౌండేషన్ సీఈఓ టీచర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో మాస్కులను పంపిణీ చేశారు. తెలంగాణ జాగృతి కాసిపేట అధ్యక్షులు సోదరి సురేష్ గారి ఆధ్వర్యంలో జయశంకర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఆయన ఉద్యమ స్ఫూర్తిని గుర్తుచేసుకున్నారు.